Type Here to Get Search Results !

పొట్లకాయ కూర - Potlakaya curry

 పొట్లకాయ కూర

పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ముఖ్యంగా పేషంట్లకి, పిల్లలకి, బాలింతలకి చాల మంచిది. చేయడం కూడ సులువే..

కావలసినవి:

పొట్లకాయ ముక్కలు ఒక కప్పు

పోపు దినుసులు

నూనె రెండు చెంచాలు

ఉప్పు తగినంత

పసుపు చిటికెడు

విధానం:

ముందుగా పొట్లకాయని వుడికించుకొని నీరు వార్చి పక్కన పెట్టుకొవాలి.

ఒక బాణలి లొ నూనె వేసి పోపు వేసుకోవాలి. పోపు చిటపటలాదాక వుడికించుకుని పక్కన వుంచిన పొట్లకాయ ముక్కలు వేసుకొవాలి. బాగా కలిపి రెండు నిమిషాలు అయ్యాక ఉప్పు పసుపు వెసుకోవాలి. మూడు నిమిషాలు అయ్యాక పొయ్యి కట్టేసి కూరని వేడి వేడి అన్నం లొ వడ్డించుకుంటే చాల బాగుంటుంది.

సూచన:

1. పోపు లొ రెండు ఎండుమిరపకాయలు వెసుకుంటే కూరకి కారం వేసుకోవాల్సిన పని ఉండదు. పొట్లకాయ కూర కి కారం బాగోదు.

2. నేతితో లేదా కొబ్బరినూనెతో పోపు వెసుకుంటే ఇంక బాగుంటుంది.



Top

Bottom