Type Here to Get Search Results !

పొట్టేలు తలకూర - Pottelu Talakaya curry

 పొట్టేలు తలకూర:

కావలసిన పదార్ధాలు:

పొట్టేలు తలకాయ మాంసం : 1 కేజి

నూనె : 50 గ్రా.

ఉల్లిపాయలు : 50 గ్రా.

పచ్చిమిర్చి : 50 గ్రా.

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 50 గ్రా.

కొబ్బరిపొడి : ఒక స్పూన్‌

మిర్యాల పొడి : కొద్దిగా

కారంపొడి : సరిపడినంత

ఉప్పు : సరిపడినంత

ధనియాల పొడి : ఒక స్పూన్‌


తయారు చేసే విధానం:

ముందుగా పొట్టేలు తలకాయ మాంసంను, ఉప్పు కలిపి కుక్కర్‌లో వేసి అందులో లీటర్‌ నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. ఆరేడు విజిల్స్‌ వచ్చాక కుక్కర్‌ను స్టౌ మీద నుండి దించేయాలి. కొంత మంది కుక్కర్‌ కాకుండా పెద్దగిన్నెలోకి మాంసంను తీసుకొని కట్టెల పొయ్యి మీద బాగా ఉడికిస్తారు. అలా ఉడికించిన కూర చాలా రుచిగా ఉంటుందని సీమగ్రామాల్లో పెద్దలు చెప్తారు. అలా ఉడికించిన మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి.

తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయాలి. ఆ తర్వాత నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొట్టేలు మెదడు (బ్రెయిన్‌)) వేసి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఉడికించిన మాంసంలోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కొద్దిగా కొబ్బరిపొడి, మిర్యాలపొడి, ధనియాల పొడి, కారంపొడి వేసి బాగా ఇగరనిచ్చి దించేయాలి. ఇప్పుడు పొట్టేలు తలకూర రెడీ.




Top

Bottom