Type Here to Get Search Results !

మటన్‌ ఖీమా మట్టర్ - mutton keema muttor

 మటన్‌ ఖీమా మట్టర్:

కావలసిన వస్తువులు :

మటన్‌ ఖీమా-కేజి

పచ్చి బఠాణీలు-ఒక కప్పు

నిమ్మరసం-ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌

వంటనూనె-రెండు టేబుల్‌స్పూన్లు

ఉల్లిపాయలు(ముక్కలుగా తరిగినవి)-రెండు

వెల్లుల్లి రెబ్బలు(చిన్న ముక్కలుగా తరిగినవి)-ఎనిమిది

అల్లం ముక్కలు-ఒక టేబుల్‌స్పూన్‌

ఉప్పు-రుచికి సరిపడా

కారం-ఒక టీస్పూన్‌

ధనియాల పొడి-ఒక టీస్పూన్‌

జీలకర్ర పొడి-ఒక టీస్పూన్‌

గరం మసాల పొడి-ఒక టీస్పూన్‌

పచ్చిమిర్చి(ముక్కలుగా తరగాలి)-రెండు.


తయారు చేసే విధానం :

అడుగు మందంగా ఉండే ఓ పాత్రను స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి, అది వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేగించాలి. పచ్చిమిర్చి ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు మటన్‌ ఖీమా వేసి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. తరువాత ముప్పావు కప్పు వేడి నీరు పోసి మంట పెద్దది చేయాలి. ఉడికే స్థాయికి రాగానే పైన మూత పెట్టి మంట తగ్గించి 30 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత నానబెట్టిన పచ్చి బఠాణీలు వేసి, నిమ్మరసం పిండాలి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి దించేయాలి.




Top

Bottom