Type Here to Get Search Results !

ఫిల్టర్ కాఫీ - Filter coffee

 ఫిల్టర్ కాఫీ

తెలవారగానే మనకు మొదట కనపడాల్సింది కాఫీ కప్పే కదండీ. ఎన్ని ఇన్స్టంట్ కాఫీ పౌడెర్లు ఉన్నా ఫిల్టర్ కాఫీ రుచికి ఏవీ సాటి రావు ఏమంటారు…ఫిల్టెర్ కాఫీ తయారు చెయడమెలాగొ చుద్దాం..

కావల్సినవి:

కాఫీ ఫిల్టర్

నీరు ఒక గ్లాసు

కాఫీ పొడి 3 చెంచాలు

పాలు అర గ్లాసు

పంచదార ఒకటి లేదా రెండు స్పూన్లు రుచికి తగ్గట్టుగా

తయారి విధానం:

కాఫీ ఫిల్టర్ పైన భాగం లొ చిల్లుల స్టాండు తీసి పైన అడుగు భాగం చిల్లులు ఉన్న అర లో మూడు స్పూన్లు కాఫీ పొడి వెసి చిల్లుల స్టాండ్ పెట్టాలి. ఒక గిన్నెలో గ్లాసు నీటిని తెర్లబెట్టాలి. తెర్లిన నీటిని ఆ చిల్లుల స్టాండ్ మీద పొయలి. మూత పెట్టేసి పావుగంట ఆగితే డికాషన్ కిందకు దిగుతుంది.

పాలు వెరే గిన్నెలొ కాగబెట్టుకొవాలి. ఇప్పుడు ఒక గిన్నెలొ అరకప్పు పాలు పొసి అందులోకి కొద్ది కొద్ది గా డెకాషన్ పొసుకుంతూ ఉండాలి. కొంచెం స్ట్రాంగ్ గా కావలనుకునే వాళ్ళు కొంచెం యెక్కువా పొసుకొవచ్చు. ఒక స్పూన్ పంచదార వెసుకుని ఇంకొక గ్లాసు తీస్కుని అందులోకి బాగా కలుపుకొవలి . అంతె ఘుమఘుమలాడె వేడి వేడి ఫిల్టర్ కాఫీ కప్పు మీ చేతిలో!



Top

Bottom