Type Here to Get Search Results !

గోష్ కా దాల్చా - Gosht ka Dalcha

 గోష్ కా దాల్చా:

కావలసినవి:

శనగపప్పు - 200 గ్రా.;

నూనె - పావు కిలో

షాజీరా - టేబుల్ స్పూను

దాల్చినచెక్క - అర టీ స్పూను

లవంగాలు - 10; ఏలకులు - 10

ఉల్లితరుగు - 100 గ్రా.;

అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.

కారం - 100 గ్రా.;

కరివేపాకు - నాలుగు రెమ్మలు

పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)

మిరియాలపొడి - టీ స్పూను

కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)

సొరకాయ ముక్కలు - 500 గ్రా.

టొమాటో ముక్కలు - 400 గ్రా.

చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)

ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు

జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు

పుదీనా - చిన్న కట్ట

మటన్ ముక్కలు - 500 గ్రా.


తయారి:

శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి.

మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.

ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.

అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.

ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.

సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.

చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి.

ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.




Top

Bottom