Type Here to Get Search Results !

పాలకూర పప్పు - Palakura pappu

 పాలకూర పప్పు

పాలకూర ఆరోగ్యానికి యెంత మంచిదో మనందరికి తెలుసు కదండీ…సులువుగా కమ్మగా అయిపొయే పప్పు యెలా చెయాలో చూద్దాం

కావలసినవి:

పాలకూర 3 కట్టలు

కందిపప్పు ఒక కప్పు

ఉల్లిపాయ ఒకటి

చింతపండు రసం 3 స్పూన్లు

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

పచ్చిమిరపకాయలు 3

పోపు సామాన్లు

నూనె ఒక చెంచా

పద్ధతి:

కందిపప్పు కడిగి పావుగంట పాటు ఒకటిన్నర గ్లాసు మంచినీటిలొ నానబెట్టుకోవాలి. ఈలోగా పాలకుర శుభ్రంగా కడిగి ఆకులు తరుక్కోవాలి.

ఉల్లిపాయ నాలుగు భాగాలు చెసుకొండి. మిరపకాయలు నిలువున చీర్చుకోండి.

ఒక వెడల్పాటి గిన్నెలొ నానబెట్టిన కందిపప్పు నీటితొ సహా వేసి, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ్ ముక్కలు, పాలకూర తురుము వెయ్యండి.

కుక్కర్ అడుగున రెండు గ్లాసులు నీళ్ళు పొసి చిల్లుల ప్లేటు పెట్టి ఈ పప్పు గిన్న పెట్టి కుక్కర్ మూత పెత్తి విజిల్ పెట్టి పొయ్యి వెలిగించండి.

నాలుగు విజిల్స్ వచాక పొయ్యి ఆపేయండి.7 నిమిషాల తర్వాత కుక్కర్ చల్లబడ్డాక మూత తెరిచి పట్టకారతో గిన్నె బయటకి తీయండి. పప్పు,ఆకు, ఉల్లిపాయ, మిరపకాయ అన్ని కలిసెల మెత్త మెదపండి.

ఒక బానలిలో లొ పోపు వెసుకుని, గరిటెతో కొద్ది కొద్ది గా పప్పు వెస్తూ కలపండి. మొత్తం పప్పు వేసేసాక ఉప్పు, పసుపు,చింతపండు రసం వేసి బాగ కలిపి మూడు నిముషాలు పొయ్యి మీద ఉంచి దించేయండి. కమ్మని పాలకుర పప్పు సిద్ధం! వేడి అన్నంలొకి నెయ్యి వెసి వడ్డించండి.



Top

Bottom