Type Here to Get Search Results !

మినప పొట్టు వడియాలు - Minapa Pottu Vadias

 మినప పొట్టు వడియాలు:

కావలసిన వస్తువులు :

మినపప్పు-ఒక కప్పు,

మినప్పొట్టు- నాలుగు కప్పులు,

ఇంగువ-కొద్దిగా,

ఉప్పు-తగినంత,

పచ్చిమిరపకాయలు-పది


తయారు చేసే విధానం :

ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరువాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు వేసి రుబ్బాలి. (మరీ మెత్తగా రుబ్బుకోకూడదు) మినప వడియాలు మాదిరిగానే ప్లాస్టిక్‌ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. ఒకరోజులో ఆరిపోతాయి. వీటిని నూనెలో వేయించి వేడి వేడి అన్నంతో నేతిలో కలుపుకుని తింటే బాగుంటాయి.



Top

Bottom