Type Here to Get Search Results !

బూడిద గుమ్మడి వడియాలు - Boodida Gummadikaya Vadiyalu

 బూడిద గుమ్మడి వడియాలు:

కావలసిన వస్తువులు :

బూడిద గుమ్మడికాయ(చిన్నది)-1,

పొట్టుమినపప్పు-అరకిలో,

పచ్చిమిర్చి-50గ్రా.

ఉప్పు-తగినంత,

ఇంగువపొడి-టీ స్పూన్‌


తయారు చేసే విధానం :

బూడిద గుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్నచిన్న ముక్కలుగా కోసి కొంచెం ఉప్పువేసి ఓ బుట్టలో మూటగట్టి దానిమీద బరువైన రాయి లాంటిది పెట్టాలి. ఇలా చేయటం వల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది. మినపప్పు కూడా రాత్రే నానపెట్టాలి. ఉదయాన్నే మినపప్పు పొట్టుతీసి నీళ్లు తక్కువగా పోసి మెత్తగా రుబ్బాలి. మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. తరువాత బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్‌ కవర్‌మీద పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత వీటిని ఒలిచి తిరగవేసి మళ్లీ ఎండనివ్వాలి. వేయించిన తరువాత వీటిని అన్నంతో పాటే తింటే బాగుంటుంది.



Top

Bottom