Type Here to Get Search Results !

సగ్గుబియ్యం వడియాలు - Saggubiyyam Vadiyalu

 సగ్గుబియ్యం వడియాలు:

కావలసిన వస్తువులు :

సగ్గుబియ్యం-ఒక కప్పు,

మంచినీళ్లు-4 కప్పులు,

పచ్చిమిర్చి- 4,

జీలకర్ర-కొద్దిగా,

ఉప్పు-తగినంత,

నువ్వులపప్పు-పావు కప్పు.


తయారు చేసే విధానం :

మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌ మీద పెట్టాలి. బాగా మరిగిన తరువాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగు లేకుండా అయితే అవి ఉడికినట్లే. తరువాత పాత్రను కిందకి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పు కలపాలి. జీలకర్ర నువ్వులు కూడా వేయాలి. కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరువాత ప్లాస్టిక్‌ కవర్‌మీద కావలసిన సైజులో పెట్టుకోవాలి. ఇవి రెండు రోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్ని స్నాక్స్‌లా కూడా తినవచ్చు.



Top

Bottom