Type Here to Get Search Results !

బియ్యపు పిండి వడియాలు - Rice flour wadiyas

 బియ్యపు పిండి వడియాలు:

కావలసిన వస్తువులు :

బియ్యపు పిండి-ఒక పెద్దగ్లాసు,

నీరు- నాలుగు గ్లాసుఉప్పు- తగినంత,

జీలకర్ర-కొద్దిగా,

అల్లం,

పచ్చిమిర్చి-కొద్దిగా


తయారు చేసే విధానం :

ముందుగా పచ్చిమిర్చి, అల్లంను ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. పాత్రలో నాలుగుగ్లాసుల నీటిని పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు కెర్లుతుండగా అందులో పచ్చిమిర్చి, అల్లం పేస్‌‌ట, ఉప్పు, జీలకర్రను వేసి కలపాలి. 5నిమిషాల తర్వాత పిండిని అందులో పోస్తూ పెద్ద గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా కలియతిప్పాలి. 10నిమిషాలు ఉడికించాక దించుకుని వేడిగా ఉన్నప్పుడే త్వరత్వరగా మీకు నచ్చిన సైజులో పెట్టుకోవాలి. పిండి కాస్త పలచగా ఉన్నప్పుడే పెడితే త్వరగా ఆరిపోతాయి. పిండి చల్లబడే కొద్దీ చిక్కబడిపోతుంది. అప్పుడు ఆరడం లేటవుతుంది. పప్పులోకి, సాంబారులోకి ఇవి చాలా బాగుంటాయి.



Top

Bottom