Type Here to Get Search Results !

నువ్వులతో చికెన్ నగ్గెట్స్ - Nuvvula Chicken Nuggets

 నువ్వులతో చికెన్ నగ్గెట్స్:

కావలసిన పదార్థాలు :

బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ ముక్కలు - నాలుగు,

నూనె - మూడు కప్పులు,

గుడ్లు - రెండు,

ఉప్పు -ఒక టేబుల్ స్పూన్,

మైదా - ముప్పావు కప్పు,

నువ్వులు - అర కప్పు.


తయరుచేసే పద్ధతి :

చికెన్ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి కడాయిలో నూనె వేడిచేయాలి. గుడ్లు, నీళ్లు, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. మరో గిన్నెలో మైదా, నువ్వుల్ని కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి తరువాత మైదా మిశ్రమంలో దొర్లించాలి. ఈ ముక్కల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించి పేపర్ టవల్ పైన వేయాలి. అంతే నగ్గెట్స్ రెడీ. వీటిని మీకు నచ్చిన సాస్తో తింటుంటే యమ్మీయమ్మీగా ఉంటాయి.




Top

Bottom