Type Here to Get Search Results !

ఉగాది పచ్చడి తయారీ విధానం - How to make Ugadi Pachdi

 ఉగాది పచ్చడి తయారీ విధానం: 

అవసరమైన పదార్ధాలు:

మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1

వేప పువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు

కొత్త చింతపండు- 100 గ్రాములు

కొత్త బెల్లం- 100 గ్రాములు

మిరపకాయలు- 2

అరటిపండు - 1

చెరకు రసం -1/2 కప్పు

ఉప్పు - సరిపడేంత

నీళ్లు

అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.


తయారు చేసే విధానం:

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది.



Top

Bottom