Type Here to Get Search Results !

అల్లం టీ - Ginger tea

 అల్లం టీ :

కావలసిన పదార్ధాలు :

పాలు : రెండు గ్లాసులు

పంచదార : రెండు స్పూన్ లు

టీపొడి : ఒక స్పూన్

యాలుక్కాయ : ఒకటి

అల్లం ముక్క : అంగుళం ముక్క

నీళ్ళు : ఒక గ్లాసు


తయారు చేయు విధానం :

1) స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో పాలు, నీళ్ళు, పంచదార, టీపొడి వేసి మరగ బెట్టాలి.

2) మరుగుతుండగా అల్లం చిదగకొట్టి వెయ్యాలి, అలాగే యాలుక్కాయ కూడా చిదిపి వెయ్యాలి.

3) ఇప్పుడు బాగా మరిగించి స్టవ్ ఆపి, కప్పులోకి వడకట్టి తాగాలి, అంతే అల్లంటీ రెడి.


ఈ టీ తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. కీళ్ళ నొప్పుల ఉపశమనానికి కూడా మంచిది. తల తిరుగుడు ఉపిరితిత్తుల్లో కఫం వంటి ఇబ్బందుల నుండి కూడా బయట పడేస్తుంది ఈ అల్లం టీ.



Top

Bottom