Type Here to Get Search Results !

కారట్ పలావ్ - Carrot Pulao

 కారట్ పలావ్.

పిల్లలకి మంచి లంచ్ బాక్స్ రెసిపి!

కావలసినవి:

తురిమిన కారట్ 2 కప్పులు

అరగంట నాన పెట్టిన బాస్మతి బియ్యం 1 కప్పు

నానబెట్టిన పచ్చి బటాణి ఒక కప్పు

బిర్యాని ఆకు, మొగ్గ, ఏలకులు,లవంగాలు,పువ్వు- అన్నీ రుచికి తగిననత

నీరు రెండు కప్పులు

ఉప్పు తగినంత

కొత్తిమీర కొద్దిగా

పసుపు చిటికెడు

నెయ్యి లేదా నూనె రెండు చెంచాలు

విధానం:

పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టండి. అందులో నూనె వేసి కాగాక మసాలా మొత్తం వేసి రెండు నిముషాలు వేయించండి. తరువాత నానబెట్టిన పచ్చి బటాణి ,తురిమిన కారట్, పసుపు వేసి రెండు నిముషాలు వేపండి. ఇప్పుదు నీరు పొసి కాగనివ్వండి. నీరు కాగాక నానబెట్టిన బాస్మతి బియ్యం

వేసి ఉప్పు వెసి కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టంది. మూడు విజిల్స్ వచ్చాక ఆపేసి చల్లరాక ప్లేట్ లోకి తీస్కుని కొత్తిమీరతో అలంకరించి వడ్డించండి.



Top

Bottom