Type Here to Get Search Results !

అరటిపండు అమృతం - Banana Payasam

అరటిపండు అమృతం.

పిల్లలు పొద్దున్నే టిఫిన్ తినట్లేదని బాధపడుతున్నారా? ఆఫీసుకి వెళ్ళే హడవుడిలొ మీకు టిఫిన్ చేసే టైం దొరకట్లేదా? ఈ అరటిపండు అమృతం చేస్కొని తాగెసేయండి. లంచ్ టైం వరకు కావలసిన శక్తి వస్తుంది. ఐదు నిముషాలలొ తయారు అయిపోతుంది కూడా.

కావలసినవి:

అరటిపండ్లు రెండు

తియ్యటి పెరుగు రెండు కప్పులు

తేనె 4 చెంచాలు

పంచదార 2 చెంచాలు

నీరు రెండు గ్లాసులు

ఇలాచి పొడి అర చెంచా

విధానం:

మిక్సీ లో నీరు తప్ప మిగతావన్ని వేసి బాగ కలిసే వరకు తిప్పండి. ఇప్పుడు నీరు పొసి మళ్ళీ తిప్పండి. గ్లాసుల్లోకి తీసుకుని అందివ్వండి. కావాలనుకుంటే పది నిముషాలు ఫ్రిడ్జ్ లో కూడా వుంచుకుని తాగవచ్చు. వొపిక ఉన్నవారు నానబెట్టిన బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ కుడా వేసుకోవచ్చు. మంచి బలవర్ధకరమైన పానీయం ఇది! ఇది ఇద్దరికి సరిపొతుంది. ఇంకా యెక్కువ కావాలంటే తగిన విధంగా పాళ్ళు పెంచుకోండి!



Top

Bottom