Type Here to Get Search Results !

ఉసిరికాయ పప్పు - Usirikaya Pappu

 ఉసిరికాయ పప్పు:

కావలసిన పదార్థాలు :

కందిపప్పు - ఒక కప్పు,

టమాటాలు - 4,

ఉల్లిగడ్డ - 1,

ఉసిరికాయలు - 10,

కారం - ఒక టీ స్పూన్,

పసుపు - కొద్దిగా

శనగపప్పు - ఒక టీ స్పూన్ ,

మినపప్పు - ఒక టీ స్పూన్,

ఆవాలు - అర టీ స్పూన్,

జీలకర్ర - అర టీ స్పూన్,

వెల్లుల్లిపాయలు - 3,

ఎండు మిరపకాయలు - 2,

కరివేపాకు - 2 రెమ్మలు,

ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :

ఉసిరికాయలను గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

టమాటాలను పెద్ద ముక్కలుగా, ఉల్లిపాయలను మామూలు సైజ్‌ల్లో కట్ చేయాలి.

కుక్కర్‌లో కందిపప్పు, ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి. మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉప్పువేసి పప్పు సుద్దతో బాగా మెదపాలి.

ఇప్పుడు కడాయిలో నూనె పోసి.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు చేయాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి కలపాలి. ఉసిరికాయ పప్పును వేడి అన్నంతో కలిపి ఆరగించేయొచ్చు.




Top

Bottom