Type Here to Get Search Results !

స్పైసీ ఎగ్ కర్ - Spicy egg curry

 స్పైసీ ఎగ్ కర్:

కావలసిన పదార్థాలు :

కోడిగుడ్లు : నాలుగు

పచ్చిమిరపకాయలు : రెండు

ఉల్లిపాయలు : రెండు పెద్దవి

టమోటాలు : రెండు పెద్దవి

మిరియాల పొడి : అర టీస్పూన్

కారం పొడి : అర టీస్పూన్

అల్లం : చిన్న ముక్క

పోపు గింజలు : అర టీస్పూన్

వెల్లుల్లిపాయలు : ఆరు పాయలు

నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు

నిమ్మరసం : నాలుగు చుక్కలు

ఉప్పు : సరిపడా


తయారుచేసే పద్ధతి :

మొదట కోడిగుడ్లను కొట్టి బాగా బీట్ చేసుకొని అందులో మిరియాల పొడి, ఉప్పు కలుపుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి. తర్వాత దాన్ని కుక్కర్ లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఈలోపు టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి అందులో పోపు గింజలు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేర్చి రెండు నిముషాలు ఉడికించాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం టమాటో ముక్కలు, కారం, పచ్చిమిర్చి ముక్కలను వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉడికించుకోవాలి. ఈ కూరలో కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న గుడ్ల మిశ్రమాన్ని కావలసిన సైజ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని దించేయాలి. అంతే ఘుఘుమలాడే స్పైసీ ఎగ్ కర్రీ రెడీ. కోడిగుడ్డులో పచ్చసొనను తినేందుకు ఇష్టపడని వారు ఇలా చేసుకొని ఆరగించవచ్చు. ఈ స్పైసీ ఎగ్ కర్రీని చపాతీలలోకి, దోసేల్లోకి సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు. అన్నంతో కూడా తినవచ్చు.




Top

Bottom