Type Here to Get Search Results !

సోరక్కాయ వడియాలు - Sorakkaya vadias

 సోరక్కాయ వడియాలు:

కావలసిన పదార్థాలు :

సొరకాయ : ఒకటి (చిన్నది)

మినపప్పు : పావుకేజీ

పచ్చి మిర్చి : 150 గ్రా.

ఉప్పు : ఆరు చెంచాలు

ఇంగువ : రెండు చెంచాలు

రాగిపిండి : ఒక కప్పు

పసుపు : రెండు చెంచాలు

అల్లం : చిన్న ముక్క


తయారుచేసే పద్ధతి :

ముందుగా మినప్పప్పును నానపెట్టుకోవాలి. సోరక్కయను చెక్కుతో సహా సన్నటి ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు,పసుపు వేసి బాగా కలపాలి. పది నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని ఓ వస్త్రంలోకి తీసుకొని గట్టి మూటలా కట్టి పిండితే నీరు వచ్చేస్తుంది. నానిన మినప్పప్పును మెత్తగా రుబ్బుకొని అందులో మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటీ చొప్పున వేసి బాగా కలపాలి. ఈ పిండిని గుమ్మడి వడియాల్ల పెట్టుకొని బాగా ఆరాక డబ్బాలోకి తీసుకోవచ్చు.



Top

Bottom