Type Here to Get Search Results !

రొయ్యల పచ్చడి - royyala pachadi

 రొయ్యల పచ్చడి:

కావలసిన పదార్థాలు :

రొయ్యలు : అర కిలో

వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్

కారం : అరకప్పు

ఉప్పు : ఒక టేబుల్ స్పూన్

లవంగాల పొడి : అర చెంచ

నూనె : అరకిలో

నిమ్మకాయ : 1


తయారుచేసే పద్ధతి :

రొయ్యలు వాసనా పోవాలంటే ముందుగా రెండు నిముషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి కనుక తొందరగా నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రొయ్యల పచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం కాస్త తక్కువగా వేస్తే బాగుంటుంది. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆర్పీవెసి, గిన్నెలోకి తీసుకున్నరొయ్యలను వేసి బాగా కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.




Top

Bottom