Type Here to Get Search Results !

ప్రాన్స్ పకోడా - Prawns pakoda

 ప్రాన్స్ పకోడా:

కావలసిన పదార్థాలు:

కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు

మైదా - 1/2 కప్పు

గుడ్డు - 1

వంట సోడా - 1/2 టీ.స్పూ.

పంచదార - 1/2 టీ.స్పూ.

షేజ్వాన్ మసాలా పొడి - 2 టీ.స్పూ.

పసుపు - చిటికెడు

చిన్న సైజు రొయ్యలు - 1 కప్పు

కొత్తిమీర - 4 టీ.స్పూ.

ఉల్లిపాయ - 1 చిన్నది

ఉప్పు - తగినంత

మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.

నూనె - వేయించడానికి


తయారు చేసే విధానం:

పచ్చి రొయ్యలు శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి మూడు కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి. తర్వాత వీటిని జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి.

ఒక గినెలో మైదా, కార్న్‌ఫ్లోర్, గుడ్డు, వంట సోడా, షెజ్వాన్ మసాలా పొడి, మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో ఉడికించిన రొయ్యలు, తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి ఓ గంటసేపు మూత పెట్టి ఉంచాలి. తర్వాత తీసి మరోసారి కలపాలి.

బాణలిలో నూనె వేడి చేసి చిన్న గరిట లేదా స్పూన్‌తో చిన్న చిన్న పకోడీల్లా వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఇలా అన్నీ చేసుకుని వేడి వేడిగా టమాటా లేదా గార్లిక్ సాస్‌తో సర్వ్ చేయాలి.




Top

Bottom