Type Here to Get Search Results !

మెంతి కూరతో వడియాలు - Menthi koora vadiyalu

 మెంతి కూరతో వడియాలు:

కావలసిన పదార్థాలు :

మెంతి కూర : రెండు కప్పులు

పెసర పప్పు : పావు కేజీ

పచ్చిమిర్చి : 100 గ్రా.

ఇంగువ : ఒక స్పూన్

జీలకర్ర : రెండు స్పూన్లు

ఉప్పు : సరిపడా (ఐదు స్పూన్లు)

కొత్తిమీర : రెండు కట్టలు

అల్లం తురుము : ఐదు స్పూన్లు


తయారుచేసే పద్ధతి :

పెసర పప్పును గంట ముందు నానబెట్టుకోవాలి. ముందుగా మెంతికూర, కొత్తిమీరను కడిగి తుడిచి పెట్టుకోవాలి. నానిన పెసరపప్పును మరోసారి కడిగి మిక్సీలో వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఇందులో మెంతి ఆకులు, కొత్తిమీర, ఇంగువ వేసి బాగా కలిపి ప్లాస్టిక్ కాగితంఫై వడియాల్లా పెట్టుకోవాలి. రెండు మూడు రోజులకి బాగా ఎండుతాయి. ఆ తర్వాత డబ్బాలోకి తీసుకోవచ్చు. బాగా ఎండితే ఎన్ని రోజులు అయిన అలాగే ఉంటాయి. వీటిని కావాలనుకుంటే తోట కూరలో కూడా వేసుకోవచ్చు.



Top

Bottom