Type Here to Get Search Results !

కోడి వేపుడు - Kodi Vepudu

 కోడి వేపుడు:

కావలసిన పదార్ధాలు :

చికెన్ : 120 గ్రాములు

అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు

పసుపు : ఒక టీస్పూన్

జీలకర్ర పొడి : ఒక టీస్పూన్

నిమ్మ రసం : 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు : ఒక టీస్పూన్

వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్

కరివేపాకు : కొద్దిగా

ఎండుమిరపకాయలు: ఒకటి లేదా రెండు

ఉల్లిపాయ : పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి )

క్యాప్సికం : 2 (ముక్కలుగా చేసుకోవాలి )

కారం : రెండు టీస్పూన్లు

ధనియాల పొడి : రెండు టీస్పూన్లు

కొత్తిమీర : కొద్దిగా

నూనె : 40 ml

గుడ్లు : 2

ఉప్పు : తగినంత


తయారీ విధానం :

పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు పేస్ట్, గుడ్లు, సగం నిమ్మ రసం, ఉప్పు కలిపి చికెన్ ముక్కలు నానపెట్టాలి. ఈ ముక్కలను కొంచెం సేపు నూనె లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక భాండి లో నూనె వేసి బాగా వేడి అయిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. అందులో ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి కొద్ది సేపు ఉంచాలి. ఈ మిశ్రమము లో చికెన్ కలుపుకొని, కొత్తిమీర, మిగతా నిమ్మరసం కలుపుకోవాలి. వేడివేడిగా కోడి వేపుడు అదుర్స్.




Top

Bottom