Type Here to Get Search Results !

గోబీ పకోడీ - Gobi Pakodi

 గోబీ పకోడీ:

కావలసిన పదార్థాలు :

కాలీఫ్లవర్ - 1,

మిరియాల పొడి - 2 స్పూన్స్,

శనగపిండి - 4 స్పూన్స్,

కార్న్‌ఫ్లోర్ - ఒక స్పూన్,

పచ్చిమిరపకాయలు - 2,

వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు,

జీలకర్ర - ఒక టీ స్పూన్ ,

ఇంగువ - అర టీ స్పూన్,

పసుపు - ఒక టీ స్పూన్,

కారం - ఒక టీ స్పూన్,

కొత్తిమీర - ఒక కట్ట,

ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :

కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి.

పచ్చిమిరపకాయలను, వెల్లుల్లిపాయలను మిక్సీ చేయాలి. దీన్ని కాలీఫ్లవర్‌లో కలుపుకోవాలి.

దీంట్లో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి.

ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కో ముక్కను నూనెలో వేసి బాగా వేయించి తీయాలి. వేడి.. వేడి పకోడీ మీ ముందుంటుంది.



Top

Bottom