Type Here to Get Search Results !

చేప ఇగురు పులుసు - fish iguru pulusu

 చేప ఇగురు పులుసు:

కావలసిన పదార్థాలు :

చేపలు -ఒక కేజీ,

చింతపండు -రెండునిమ్మకాయలంత

ఉల్లిపాయలు -రెండు,

పచ్చిమిరపకాయలు-5

అల్లం,వెల్లుల్లి పేస్టు -ఒక స్పూన్‌,

కొత్తిమీర పేస్టు -ఒక స్పూన్‌

గరంమసాలా -అరస్పూన్‌,

మిరపపొడి -ఒక స్పూన్‌

ఉప్పు -తగినంత,

పెరుగు -రెండు స్పూన్లు

బెల్లంపొడి -అరస్పూన్‌,

పసుపు -తగినంత

పోపు దినుసులు-కావలసినంత,

నూనె -సరిపడా


తయారుచేసే విధానం :

ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపుదినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి పెరుగు ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేపముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లంపొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.




Top

Bottom