Type Here to Get Search Results !

చింతకాయ - పాలకూర పప్పు / Chintakaya Palakura Pappu

 చింతకాయ - పాలకూర పప్పు:

కావలసిన వస్తువులు:

‌చింతకాయ ముక్కలు - పావు కిలో

‌‌ఆకంది పప్పు - 1 కప్పు

‌పపాలకూర - ‌‌1 కట్ట

ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగాలి)

నూనె - టేబుల్‌ స్పూన్‌

పచ్చిమిర్చి - 4

ఎండుమిర్చి - 3

కరివేపాకు - 2

‌ఉప్పు - తగినంత

జీలకర్ర, ఆవాలు - 1 టీ స్పూన్‌

‌వఇంగువ - చిటికెడు

కొత్తిమీర - తగినంత


తయారు చేసే విధానం:

ముందుగా పాత్రలో కప్పు నీళ్లు పోసి చింతకాయ ముక్కలు వేసి మెత్తగా ఉడకబెట్టి, మెదుపుకోవాలి. మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండేసి, రసం తీసుకోవాలి. కుక్కర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి కంది పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి. పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఉడకబెట్టుకున్న ప్పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయగుజ్జు, ఉప్పు, నీటిని అందులో కలిపి, పదిహేను నిమషాలుంచి దింపేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి వడ్డించాలిి.




Top

Bottom