Type Here to Get Search Results !

చింతచిగురు దొండకాయ - Chintaciguru dondakaya

 చింతచిగురు దొండకాయ:

కావలసిన పదార్థాలు :

దొండకాయలు - పావుకిలో

చింతచిగురు - కప్పు

సెనగ పప్పు - టేబుల్ స్పూన్

మినప్పప్పు - టేబుల్ స్పూన్

కొబ్బరి తురుము - టేబుల్ స్పూన్

ఎండు మిర్చి - 4

ఆవాలు - అరటీస్పూన్

నూనె - 4 టేబుల్ స్పూన్లు

ఉప్పు - తగినంత

కరివేపాకు - 2 రెమ్మలు

వేరుసెనగ పప్పు - అరకప్పు


తయారుచేసే పద్ధతి :

దొండకాయలను నిలువుగా ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి.

మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత దొండకాయ ముక్కలు, ఉప్పు, చింతచిగురు, కారం వేసి కలుపుతూ వేయించాలి. చివరగా కొబ్బరి తురుము కూడా వేసి కలిపి దించాలి.




Top

Bottom