Type Here to Get Search Results !

చిక్కుడుకాయ అల్లం కూర - Chikkudukaya Allam Curry

చిక్కుడుకాయ అల్లం కూర.

గొంతు బాలేనపుడు, జ్వరం ఉన్నపుడు, నోరు చేదుగా అనిపించినపుడు చేస్కుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరొగ్యానికి యెంతో మంచిది కూడా!

కావలసినవి

చిక్కుడుకాయ ముక్కలు – 2 కప్పులు

పచ్చిమిర్చి నాలుగు దంచండి

తరిగిన అల్లం రెండు చెంచాలు

నూనె ఒక చెంచా

పోపు సామాను

కరివేపాకు రెండు రెమ్మలు

ఉప్పు తగినంత

పసుపు రెండు చిటికెళ్ళు

విధానం:

చిక్కుడుకాయలు కడిగి పురుగు లేకుండా చూసుకుని ముక్కలుగా తరుక్కోండి. కుక్కర్లో రెండు విజిల్స్ వరకు వుడికించుకొని నీరు వంపేసి పక్కన బెట్టండి.

బాండీలో నూనె వేసి పోపు వేసి, అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి నిముషం వేయించండి. తరువాత చిక్కుడుకాయ ముక్కలు వేసి కలిపి, మూత పెట్టండి, రెండు నిముషాల తరువాత పసుపు, ఉప్పు వేసి మరో నిముషం పాటు మూత లెకుండా వెయించండి. ఇష్టమైతే ఆఖరున కొబ్బరికోరు కూడా జల్లుకొవచ్చు.పొయ్యి కట్టేసి వేడి వేడి గా వడ్డించండి! కొంత మంది ఆఖర్న సెనగ పిండికూడా జల్లుకుంటారు. అలా ఐతె చివర్లో సెనగ పిండి జల్లి ఒక నిముషం పాటు వెయించి ఆపెయండి.



Top

Bottom