Type Here to Get Search Results !

బీరకాయ, వెల్లుల్లి కారం - Beerakaya vellulli karam

 బీరకాయ, వెల్లుల్లి కారం:

కావలసినవి:

బీరకాయలు - 500 గ్రా.

ఉల్లిపాయ - 1

పసుపు - 1/4 టీ.స్పూ.

ఎండుమిర్చి - 5

జీలకర్ర - 1/2 టీ.స్పూ.

ధనియాలు - 1 టీ.స్పూ.

వెల్లుల్లి రెబ్బలు - 10

ఉప్పు - తగినంత

నూనె - 4 టీ.స్పూ.


తయారు :

బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి వెల్లుల్లి రెబ్బలు కలిపి బరకగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక వెల్లుల్లి కారం పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు నిదానంగా ఉడకనివ్వాలి. నీరంతా ఇగిరిపోయాక తర్వాత దింపేయాలి. బీరకాయలు లేతగా ఉంటే ఈ కూర చాలా త్వరగా తయారవుతుంది. అన్నం, చపాతీలకు బావుంటుంది.




Top

Bottom