Type Here to Get Search Results !

బీరకాయ తొక్క వేపుడు - Beerakaraya Tokku Vepudu

 బీరకాయ తొక్క వేపుడు:

కావలసిన పదార్థాలు :

బీర తొక్కలు - 2 కప్పులు,

వెల్లుల్లి - 2 రేకలు,

దనియాల పొడి - అర టీ స్పూను,

జీలకర్ర పొడి - చిటికెడు,

కారం - అర టీ స్పూను,

పసుపు - చిటికెడు,

ఉప్పు - రుచికి తగినంత,

తాలింపు దినుసులు - సరిపడా,

కరివేపాకు - 4 రెబ్బలు,

నూనె - 1 టేబుల్‌ స్పూను.


తయారుచేసే విధానం:

బీర తొక్కలో రెండు కప్పుల నీరు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, నీరు వడకట్టాలి. కడాయిలో తాలింపుతో పాటు తరిగిన వెల్లుల్లి రేకలు కూడా వేగించాలి. తర్వాత ఉడికించిన బీర తొక్కలు వేసి దోరగా వేగించి దనియాల పొడి, కారం, ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. వేడి వేడి అన్నంతో కలుపుకుంటే భిన్నమైన రుచి ఆస్వాదించొచ్చు (తొక్కల్ని మరీ మెత్తగా ఉడికిస్తే రుచి తగ్గే అవకాశం ఉంది).





Top

Bottom